గిడుగు రామ్మూర్తి పంతులుగారిసేవలు ; -డా. భరద్వాజరావినూతల 9866203795

 🛑సాహితీబృందావనవేదిక 💚 
ప్రక్రియ-సున్నిరూపకర్త -నెల్లుట్ల సునీత 
🦚🦚🦚🦚🦚🦚🦚
4️⃣9️⃣6️⃣)
తెలుగుభాషా ఉద్యమకారుడు
వ్యవహారికభాషవైపు వేశాడడుగు
తెలుగువారు మర్చిపోలేని గిడుగు
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
******** 
4️⃣9️⃣7️⃣)
గ్రాంధికాన్ని గాలికొదిలేసి
వ్యవహారికానికి గొడుగు పట్టి
సృష్టించాడు నూతన ఒరవడి
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********  
4️⃣9️⃣8️⃣)
తెలుగుకు చేశాడుపునరుజ్జీవనం
 తెలుగుకు కొత్త జీవనం
అందుకే ఆయనకు నమస్కారం
 చూడచక్కని తెలుగ సున్నితంబు .---!
******** 
4️⃣9️⃣9️⃣)
 బహుభాషా ప్రావీణ్యుడాయన
తెలుగువ్యాకరణ సృష్టికర్త ఆయన
సవరపదకోస రచయిత ఆయన
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********  
5️⃣0️⃣0️⃣)
ఉపాధ్యాయుడిగా సాగించాడు వృత్తి
వీరేశలింగంతో కలిపాడు జత
తెలుగుభాషకు చేశాడు పట్టాభిషేకం
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
*********
కామెంట్‌లు