"సో౭హం" భావము"శంకరప్రియ.," శీల-సంచారవాణి: 99127 67098
 👌 సచ్చిదానంద మయ
పరంబ్రహ్మ తత్వము!
      శాశ్వతమగు సత్యము!
శంకర ప్రియులార!(1)
👌 "అదొకటే నేను" యని
"ఆత్మయే తాను" యని!
      "సో౭హం" భావార్ధము!
శంకర ప్రియులార!(2)
          ( శంకర ప్రియ పదాలు.,)
👌"సో౭హం".. హంస మంత్రం! దీనినే.. "అజపా మంత్రము" అని, వ్యవహరిస్తారు! మనలో.. శ్వాస, మరియు, నిశ్వాసల ద్వారా.. అనునిత్యం.. "సో౭హం" మంత్ర జపం.. జరుగుతుంది
👌"మోహము" 
దుర్భావము లలో ఒకటి! ఉన్నదానిని.. లేనట్లు గాను; లేని దానిని.. ఉన్నట్లు గాను, భ్రమింప జేస్తుంది.. మోహము!మానవులందరూ.. లౌకిక వ్యవహారము లందు.. ఆధ్యాత్మిక భావన లేక; శ్లేష్మములో బడ్డ ఈగవలె కొట్టు మిట్టాడు తున్నారు!
     "మోహము"నకు ప్రతిపక్ష భావమే.. "సో౭హం"! 
     మోహ క్షయమే "మోక్షము"!
 
👌ఆరాధకులు, మరియు, సాధకు లందరు.. ముక్తి సాధనకు.. భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గములను అనుసరించు చున్నారు! స్వాత్మ తత్త్వ విచారణ కావించు చున్నారు! "సో౭హం" భావంతో.. జీవన్ముక్తిని పొందు చున్నారు, ఆస్తిక మహాశయులు! శివమస్తు!
⚜️శార్దూలం పద్యము⚜️
     మోహధ్వంసము చేసి కొమ్మికను; నీ మోమోటము న్వీడు; మా
      యాహంకారము సాగనంపి, భవదీయాన్వేషణా దృష్టిలో
     "సో౭హం"బంచు దలంచి ధన్యుడవు కా; చోద్యంబు లౌక్యంబునౌ
      సాహిత్యంబు ప్రయోజనం బిడదు; వత్సా! నీకు వీడం దగున్.
           
      ( మాయాహంకారము అనగా "మాయతో కూడిన 
అహంకారము"; "సో౭హం" అనగా అదియే నేను, అని, భావార్ధం., )
( రచన: జంధ్యాల జయకృష్ణ బాపూజీ., )

కామెంట్‌లు