🙏కంచి పరమాచార్య
చంద్ర శేఖరేంద్రుడు!
నడయాడు దైవమ్ము!
శంకర ప్రియులార!(1)
🙏సర్వజ్ఞుడే స్వామి!
ప్రాజ్ఞుడే మాస్వామి!
నడయాడు దైవమ్ము!
శంకర ప్రియులార!(2)
👌శ్రీ కంచి పరమాచార్యులైన శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు.. ఆసేతు హిమాచల పర్యంతమైన, సువిశాలమైన, మన భారత దేశమంతటా కాలినడకనే పర్యటించారు! మన స్వాతంత్ర్య మహోద్యమములో ప్రధాన భూమిక పోషించారు! నూరు సంవత్సరములు జీవించారు! శ్రీ స్వామివారు.. ప్రజలందరిలో, "నడయాడు దైవమ్ము" గా, ప్రసిద్ధి పొందారు!
👌శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు.. సమస్తము తెలిసిన బ్రహ్మవేత్తలు! కనుక, "సర్వజ్ఞులు"! తెలియ దగినది, బాగుగా తెలిసిన మహాత్ములు.. స్వామివారిని ఆశ్రయించారు! కనుక, "ప్రాజ్ఞులు"!
👌శ్రీస్వామి వారి అనుగ్రహము చేత మనకు అజ్ఞానము లేకుండా పోతుంది. లోకంలో జనులందరు వారి దర్శన అనుగ్రహాదుల కొరకై ఆశించు చున్నారు!
శ్రీస్వామి వారి కంటే అన్యమైన దేదీ మనము వెతికి తెలిసికొన వలసినది; వెతికిపొంద వలసినది మరేదీ లేదు, ఉండదు! స్వామి వారి అనుగ్రహము సమస్త శుభాలను మనపై వర్షిస్తుంది. వారిపై మనస్సు నిలిచినచో మోక్షమే లభిస్తుంది.
🙏ప్రపంచము నందు.. ప్రతి అంశము లోను, అణు వణువునా వారి చరణారవిందము; విజ్ఞానవంతులైన భక్తులకు కనుపించుచునే ఉంటుంది. అట్టి శ్రీచరణులు, కామకోటి పీఠాధీశ్వరులు, పరమాచార్యులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు; మనల నందరిని రక్షించుగాక! శివమస్తు!
⚜️ ధ్యాన శ్లోకము⚜️
య స్సర్వజ్ఞ ఇతీర్యతే యమభితః ప్రాజ్ఞాన యేనాజ్ఞతా
యస్మైచ స్పృహయత్య శేషజనతా యస్మాన్న మృగ్యం క్వచిత్!
యస్య ప్రేమ లతాభి వర్షతి శుభాన్ యస్మి న్మనోముచ్యతే
సో౭వ్యాత్సర్వ విభక్తి గమ్యచరణః
శ్రీకామకోటీ శితా )
( కంచి పరమాచార్య ప్రస్తుతి.,)
🚩జయ జయ శంకర!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి