🙏శక్తి సంపన్నమగు
దైవమందును భక్తి
కలిగియుండా లెపుడు!
ఆత్మ బంధువు లార!(1)
🙏జీవనాధార మగు
దేశమందును భక్తి
కలిగియుండా లెపుడు!
ఆత్మ బంధువు లార!
( ఆత్మ బంధు పదాలు., శంకర ప్రియ.,)
👌"దైవము" అనగా.. "అర్చామూర్తి లో నున్న పరమేశ్వరుని చైతన్యము!"
"దేశము" అనగా, రేఖా చిత్రములో నున్న ప్రజా జీవనము!
"జీవసేవ యే శివసేవ" అని, జగద్గురు ఆది శంకరాచార్యుల వారు; మన భారతదేశ మంతటా పర్యటించారు! ప్రజ లందరికీ.. కర్మ, భక్తి, జ్ఞాన మార్గముల ప్రాశస్త్యమును విశదీకరించారు!
👌ఆది శంకరాచార్య స్వామివారి మఠముల గురు పరంపరలో.. కాంచీపురం, కామకోటి పీఠాధిపతులు.. శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారొకరు! వారు .. మన భారత జాతికి, "మార్గ దర్శక సూత్రములు" కొన్నింటిని ఉదాహరించారు! అవి..
👌"మానవసేవ యే మాధవసేవ!" కనుక ప్రతి భారతీయుడు "మన సనాతన ధర్మమును" ఆచరించాలి! మన చుట్టు పర్యావరణ పరిరక్షణకు గ్రామాలలో, నగరాలలో మొక్కలు, చెట్లు నాటడం, చెరువులు త్రవ్వడం; తక్షణ కర్తవ్యం! అట్లే దేవాలయముల సంరక్షణము, వేదముల సంరక్షణము.. కావించాలి! గోశాలలు నిర్మించడం, వికలాంగుల సంక్షేమం, అన్నదానాలు, చలివేంద్రాలు.. నిర్వహిస్తూ; గ్రామీణాభివృద్ధికి, దేశాభివృద్ధికి సహకరించాలి! తద్వారా "దైవభక్తిని, దేశభక్తిని" పెంపొందించు కుంటూ; కుటుంబ వ్యవస్థను పరిరక్షిoచు కోవాలి! అని, హితోపదేశం చేశారు, స్వామీజీ!
👌ఆరాధకులు, మరియు ప్రజలందరూ.. ఆదర్శ జీవితం, ఆధ్యాత్మిక జీవితం గడపాలి! అని, సకల మానవాళికి శుభసందేశ మిచ్చారు, కాంచీపురం, జగద్గురు పీఠాధిపతులు, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు!
🚩జయ జయ శంకర!
హర హర శంకర!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి