జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి.
సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాల్లా పరిమళాలు
వెదజల్లే పూల చుట్టూ భ్రమించే భ్రమరముల్లా....
నీ మధురమైన మరపురాని మనోజ్ఞ మైన స్వప్నాలు
నన్ను నా మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తూన్నాయి
ఏమిటో మరిచిపోనీ ఆ మధుర స్మృతి
నిజంగా.... ఎంత తీయగా... హాయిగా.......
వెన్నెల కన్నా చల్లగా........ శీతల వాయువులా
నా హృదయాన్ని తాకుతూ........ మైమరిపిస్తూంది.
నన్ను ఏదో నవ లోకం లో విహారింపజేస్తూ
తన్మయం కలిగిస్తూంది. దాని పేరు ఏమిటో!!
ఏదో చెప్పినట్లు నా చెవిలో గుసగుసలాడుతుంది. ఏమిటది!!?
ఆ పదము ఆ అక్షరం ఎంత తీయనీదో!!
జగత్తునే ఊయల ఊగిస్తుంది. అటువంటిది
మన మనసును ఎంత పరవశం చేస్తూందో కదా!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి