ఇదే నా జాగ; - ప్రభాకర్ రావు గుండవరం(మిత్రాజీ)ఫోన్ నం.9949267638
ఈ మట్టిలోనే పుట్టిన
ఈ మట్టిలోనే పెరిగినా
ఈ జాగ నాదంటే
కాదంటోడు వాడెవ్వడూ......

తెలుగు పల్లెలో పుట్టిన
తెలంగాణ లో పుట్టిన
తెలంగాణ నా ఊరు
భరత భూమి నా నేల

ఈ తల్లికి కొడుకుగా
ఇక్కడే నే జన్మించిన
జన్మ నిచ్చిన నా తల్లికి
నన్ను కన్న ఈ నేలకు
నేనేమిటో తెలుసు
నేనెవరో తెలుసు
పురుడు పోసిన పుడమికి
నా జాగేదో తెలువదా!!!?
🌹🌹🌹

కామెంట్‌లు