గణపతి ప్రార్ధన (వినాయక చవితి సందర్బంగా )--ప్రభాకర్ రావు గుండవరం(మిత్రాజీ)ఫోన్ నం.9949267638
స్వాగతం సుస్వాగతం
మా చిన్ని గణపతికి
మా బొజ్జ గణపతికి స్వాగతం సుస్వాగతం

మా ఇంటికి రావయ్య గణపతీ
మము బ్రోవ రావయ్య గణపతీ
మూషిక వాహనా మా ముద్దుల గణపతీ 
మా ఆథిద్యం స్వీకరించి
మము కరుణించ రావయ్యా!!

పూలను తెచ్చాము పళ్ళను తెచ్చాము
గరికను తెచ్చాము తులసీ పూల తెచ్చాము
తీరొక్క పత్రితో పూజ చేయవచ్చాము
మా పూజలందుకో గణపతీ
మమ్ము కాపాడుము ఓ గణపతీ

ఉండ్రాళ్ళు పాయసాలు
కుడుములు లడ్డూలతో
తుమ్మికూర పప్పు బలుసాకు
చారుతో మృష్టాన్నం చేసాము
నైవేద్యం పెడతాము
ఆరగించి అనుగ్రహించు ఆది దేవ గణపతీ
🌹🌹🌹

కామెంట్‌లు