ఆమని అందం; ప్రభాకర్ రావు గుండవరం(మిత్రాజీ )ఫోన్ నం.9949267638
అందమైన పూవులు
ఆమని చిరునవ్వులు
రంగుల హరివిల్లులు
ఆమని యవ్వన సొగసులు

కలువపూల కన్నులు
ఆమె కాటుక కన్నులు
పారిజాత కుసుమాల
పరిమళించే పెదవులు

చక్కని జలపాతంలా
తెల్లనైన పలు వరసలు
నల్లనైన మేఘములు
ఆ సుందరి శిరోజాలు

పచ్చనైన ప్రకృతి
ఆ జవ్వని సౌందర్యము
కనువిందు గొలిపే సుందరము
ఆ మాలిని ముఖ మందిరము

అప్సరసల తలదన్నే
సుకుమారం సౌశీల్యం
అందమైన మనోజ్ఞమైన
పసిడి వెన్నెల పడుచుకాంత
🌹🌹🌹

కామెంట్‌లు