మాతృ భాషకు వందనమ్;-- ప్రభాకర్ రావు గుండవరం (మిత్రాజీ )ఫోన్ నం 9949267638అత్వెల్లి, మేడ్చల్ జిల్లా

 తెలుగు భాషకు వన్నె తెచ్చిన
మహా మనుషులకు వందనమ్
తెలుగు కీర్తిని చాటి చెప్పిన
కవీశ్వరులకు వందనమ్
వందనమ్ జయ వందనమ్
తెలుగు భాషకు వందనమ్
మన మాతృ భాషకు వందనమ్
గ్రాంథికాన్ని వ్యవహారిక భాష చేసిన
గిడుగు రామ్మూర్టీకి వందనమ్
దేశ భక్తి గేయాలు రాసిన
రాయప్రోలుకు వందనమ్
తెలుగు భాష ఔన్నత్యాన్ని
చాటి చెప్పెను గురజాడ నాడు
దాశరథి వేటూరి శ్రీశ్రీ సినారేలంతా
కవితలెన్నో గుప్పించినారు 
పాటలు పద్యాలు వ్రాసి
మధురమైన తెలుగును వినిపించినారు
ఎందరో మరెందరో మహానుభావులు
తెలుగు భాషను ఉద్దరించినారు
అందరికీ వందనమ్
తెలుగు భాషకు వందనమ్
తెలుగు తల్లికి వందనమ్
=====================
 (గిడుగు రామ్మూర్తి తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా )
కామెంట్‌లు