భలే! భలే! బంతి!!;- --గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు,సెల్:9966414580.
బంతి బంతి భలే బంతి
పొట్ట నిండా గాలి ఉండు
దాన్ని నేలకేసి కొడితే 
పైపైకి ఎగురుతుండు

ఆటల్లో ముందు ఉండు
తలయోమో తాత గుండు
ఆడుతుంటే మంచినుండు
ఆనందం పంచుతుండు

ఇష్టమైన నా బంతి
రంగు రంగుల నా బంతి
గాలిలో ఎగురుతుంది
భూమి పైన దొర్లుతుంది

బౌండరీ దాటుతుంది
సిక్సర్ గా వెళుతుంది
క్రికెట్ లో ఆడు  బంతి
గట్టిదనం ఉంటుంది


కామెంట్‌లు