వజ్ర భారతికి వందనాలు;--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు,సెల్:9966414580.
స్వాతంత్రం వచ్చింది
సంబరాలు తెచ్చింది
వజ్రోత్సవ వేళలో
ఆనందం చిలికింది

 నింగిలోన ఎగిరింది
రెప రెపలాడుతుంది
మూడు రంగుల జెండా
గర్వంగా చూస్తుంది

జెండా జన్మదినము నేడు
శిరముఎత్తి  పైకి చూడు
ఎందరో మహనీయులు
ప్రాణాలిచ్చిరి నాడు

జెండాకు వందనాలు
భారతికి వందనాలు
స్వాతంత్ర్య యోధులకూ
సదా సదా వందనాలు


కామెంట్‌లు