సహాయం;-B.గణేశ్8వ తరగతి సెక్షన్ D. జడ్ పి హెచ్ ఎస్ . ఇందిరానగర్, సిద్ధిపేట

 అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు వాళ్ల పేర్లు సురేష్ , రమేష్, గణేష్       ఆ ముగ్గురు స్నేహితులు ఒకరోజు అడవికి వెళ్లాలని అనుకున్నారు వాళ్ళు అనుకున్నట్టే అడవికి వెళ్లారు ఒక జింక చాలా గాయాలతో పడి ఉంది గాయాలతో ఉన్న జింకను చూసి ముగ్గురు స్నేహితుడు అక్కడికి  వెళ్లారు ముగ్గురు స్నేహితుల్లో ఒకడు తన దగ్గర ఉన్న రుమాలతో కట్టు కట్టాడు అక్కడి నుంచి ముందుకు వెళ్తారు కాస్త ముందుకెళ్లాక ఒక రాక్షసుడు ఎదురయ్యాడు రాక్షసుడు ఒక ప్రశ్న అడిగాడు ప్రశ్నకు సరైన సమాధానం ఇస్తే మిమ్మల్ని విడిచిపెడతా లేదా అమాంతం మింగేస్తా అని అన్నాడు ప్రశ్న ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్ర జాతీయ జంతువు పేరు ఏమిటి ఎందుకు ముగ్గురు స్నేహితులకి గుర్తుకు రాలేదు కొద్దిసేపు ఆలోచించాక ముగ్గురు జింక అని చెప్తారు రాక్షసుడు సంతోషించి ముందుకు వెళ్ళమంటాడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు
కామెంట్‌లు