ఆగురువు గారి దగ్గర ముగ్గురు శిష్యులున్నారు.భయభక్తులతో చదువుతూ సేవచేస్తారు.అందులో హరి అనేవాడు ఎప్పుడూ భక్తి ఆధ్యాత్మిక విషయాలు తప్ప వేరే ఏవి మాట్లాడేవాడు కాదు. గురువు చెప్పింది చెప్పినట్లే టకటకా అప్పజెప్పేవాడు.దైవస్మరణ లో మునిగేవాడు.అందరూ హరిని పొగడటంతో కాస్త అహం నేనే గొప్ప అనే భావం వచ్చింది. ఓరోజు వంట ఐనాక గురువు కి వడ్డన చేసి ఆముగ్గురు శిష్యులు తాముకూడా భోజనం చేయసాగారు.ఆరోజు వంట డ్యూటీ శివాది! అంతా నోరెత్తకుండా తింటుంటే హరి మాత్రం "అబ్బా!కూర ఉప్పుకషాయం శివా!"అంటూ ఆఅన్నం తీసి నేలపై పెట్టాడు. గురువుగారికి హరిపై ఉన్న మంచి అభిప్రాయం కాస్త కరిగింది.శివా గిరి చదువులో వెనుకబడిఉంటారు.త్వరగా బుర్రకి ఎక్కించుకోరు.పూజ పునస్కారాలపై ఆసక్తి లేదు. కానీ హరికి వారిపై చిన్న చూపు ఉంది అని గ్రహించాడు గురువు గారు. "హరీ!అనుక్షణం దైవం భగవస్మరణ అంటావు కదా?ఇప్పుడు నదీస్నానం కి వెళ్లి వద్దాం "అన్నాడు. "స్వామీ!భోజనం చేశాక స్నానం చేయకూడదని చెప్పారు కదా?" "కానీ పద!దైవస్మరణ చేస్తూ ఏపనైనా చేయొచ్చు " అనగానే శివా గిరి కూడా "మేమూ వస్తాం"అనిబైలు దేరారు.నది దగ్గర గురువు చెప్పగానే ముగ్గురు నీటిలో తలలు ముంచారు.కావాలనే గురువు గారు హరితలను నీటిలో నొక్కి పట్టాడు. హరి గిలగిల గింజుకుంటూ"గురూజీ!ఊపిరి ఆడటంలేదు" అని ఆయన చేతిపట్టు విడిపించుకున్నాడు.
అప్పుడు గురువు ఇలా అన్నారు"నీవు దైవస్మరణ దేవునిగూర్చి ఆలోచిస్తావు అని అంతా భావిస్తున్నారు. కానీ ఈరోజు కూరలో ఉప్పు ఎక్కువ ఐందని శివా ని విమర్శించావు.వారు నోరెత్తకుండా అన్నంతినగానే స్నానం కి వచ్చారు.నీవు నీటిలో తలముంచి దైవస్మరణ చేయకుండానే ఊపిరి పోతోంది అని భావించావు.దీన్ని బట్టి హరీ!నీవే ఆలోచించు శివా గిరి చదువు లో కాస్త వెనకబడినా గురుభక్తిలో తీసిపోరు.నోటితో గొప్పలు చెప్తూ ఇతరులను చిన్న బుచ్చేవారు నాదృష్టిలో అధములు!"అంతే హరి అహం నశించింది.అసలు సిసలు వైరాగ్యం అంటే ఏమిటో తెలిసింది🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి