పిల్లలకు రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది అందుకే వారు వాతావరణం లో ఏ చిన్న మార్పు వచ్చినా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే జ్వరం. నిజానికి జ్వరం అనేది రోగం కాదు, అది ఒక లక్షణం మాత్రమే. జ్వరం రావడానికి కారణాలు అనేకం ఉండవచ్చు. పిల్లలు ఏదైనా ఇన్ఫెక్షన్ కి గురైతే జ్వరం అనేది వస్తుంది. పిల్లలు నెమ్ము వస్తువులు తిన్నా, చాక్లెట్లు, ఐస్క్రీమ్లు తిన్నా, వానలో తడిచినా, నీళ్లలో ఆడినా జలుబు, దగ్గు, జ్వరం అనేవి సర్వసాధారణం.
అయితే ఈ జ్వరం తరచుగా రావడం క్షేమమేనా అంటే ? లోపల దాగిన జబ్బులను బయటపడేయడంలో ఈ జ్వరం అనేది మంచిదే అయినప్పటికీ, పిల్లల విషయంలో ఇది ఎంత మాత్రము మంచిది కాదు. పిల్లల్లో టెంపరేచర్ పెరగడం వల్ల ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా జ్వరం కారణంగా ఫిట్స్ వచ్చే కండిషన్ ను " ఫెబ్రైల్ సీజర్స్"
అని అంటారు. పిల్లలు తరచుగా ఫిట్స్ కి గురి కావడం వల్ల ఎపిలెప్సి అంటే మూర్చ రోగులుగా మారి మందులను వాడవలసిన పరిస్థితి. ఈ ఫెబ్రైల్ సీజర్స్ అనేవి ముఖ్యంగా ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వయసు వున్న చిన్నారులలో ఎక్కువ శాతంగా నమోదు కాబడుతున్నాయి. కనుక పిల్లల విషయంలో అశ్రద్ధ, అజాగ్రత్త తగదు. అందుకే ముందుగా చిన్నారులు ఉన్న ఇళ్లలో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వాడవలసిన పారాసెటి మాల్ సిరప్, అస్కారిల్ సిరప్, సీపీఎం లాంటి మందులను ముందే కొని భద్రపరుచుకోవాలి. పిల్లలను రెగ్యులర్ చెకప్ కు తీసుకొని వెళ్ళినప్పుడే వైద్యులతో మందుల కొలతల (ఏం.ఎల్, డ్రాప్స్) గురించిన వివరాలు అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ మందులు లేనప్పుడు
ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలతో
తడి బట్టను నుదిటి పై ఉంచడం లాంటివి చేసి జ్వరాన్ని తగ్గించే ప్రయత్నాన్ని చేయాలి. ఒకవేళ జ్వరం మందులతో కానీ తగ్గకపోతే
వెంటనే వైద్యులను సంప్రదించి, బ్లడ్ టెస్ట్ లాంటి వైద్య పరీక్షలను చేయించి అందుకు తగ్గ విధంగా వైద్యాన్ని అందించాలి. కాబట్టి జాగ్రత్త వహించండి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి