సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 ఘర్షణ... సంఘర్షణ 
   *****
 ఘర్షణ, సంఘర్షణ దాదాపుగా ఒకే అర్థాన్ని కలిగి వున్నా వీటిని మన మనసుకు, మానసిక స్థితికి అన్వయించుకుందాం.
ఘర్షణ అనేది అంతర్,ఉపరితల సంశ్లేషణ.ఒకదానితో ఒకటి జరిగిన రాపిడినే ఘర్షణ అంటారు. ఈ ఘర్షణ జరిగినప్పుడు ఓ శక్తి ఉద్భవిస్తుంది.
 సమాజంలోని   కొందరు వ్యక్తులు,కొన్ని సమస్యలు,సమాజ వ్యతిరేక చర్యలు  ఇలాంటివి ఏవైనా కావచ్చు. అవి మన మనసును తాకినప్పుడు ఒకలాంటి వేదనకు, ఉద్విగ్నతకు లోనవుతూ ఉంటాం.అలా జరగడమే ఘర్షణ.
ఇక  సంఘర్షణ. ఇది తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు జరిగే రాపిడి.
ఎంత మంచిగా ఉండాలని అనుకున్నా, తన ప్రతిభతో ముందుకు వెళ్తున్నా, ఓ మంచి కార్యక్రమం తలపెట్టినా ,ఓర్చలేని వ్యక్తుల మాటలతో కలతకు లోనై మనసు పడే వేదనే సంఘర్షణ.
ఇలాంటి సంఘర్షణలే లోలోపలి శక్తిని, నిబద్ధతను, ధైర్యంగా ఎదుర్కోగలిగే మానసిక స్థైర్యాన్ని వెలికితీస్తాయి.
కాబట్టి పోరాడే యోధుడిలా ఎప్పుడూ ఇలాంటి వాటిని సవాల్ గా తీసుకుని ముందుకు సాగిపోవాలి.
తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు భయపడవని ఋజువు చేయాలి.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏



కామెంట్‌లు