సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 సఫలం... విఫలం...
  ******
ఏ పనైనా, కార్యక్రమం అయినా సఫలం కావడం, విఫలం కావడం అనేది చాలా వరకు మనం అనుసరించే మార్గాన్ని , ఆలోచించే ధోరణిని బట్టే ఉంటుంది.
మనం వెళ్లే దారిలో మన మనసు, మానసిక దృఢత్వం, సంకల్ప బలం, తీసుకునే నిర్ణయాలు  సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి.
 అందులో నిస్వార్ధం, నిజాయితీ మంచితనం ఇమిడి ఉంటే కొంచెం వెనుకా ముందైనా అనుకున్నది  తప్పకుండా సఫలం అవుతుంది.
మోసపూరిత ఆలోచనలతో తలపెట్టేది ఏదైనా.. మొదట్లో సఫలమైనట్లు కనిపించినా ఆ తర్వాత ఘోరంగా విఫలమయ్యే  పరిస్థితులు వస్తాయనేది గ్రహించాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు