కెరటాలెంతగా ఉరికి వచ్చినా
తీరంలో నిలువ లేవు
కష్తసుఖాలూ అంతే
కలకాలం మనతో ఉండిపోవు
ఆడుగు వెనుక అడుగు
చీకటి వెంటే వెలుగు.
గడచి పోయే కాలం
మరపునివ్వదు కానీ
మోయలేని గుండెబరువును
అలవాటుగా చేసేస్తుంది.
ఊహకు ఊతం
బాధకు ఊరట
ఆశకు జీవం
దుఃఖానికి ఓదార్పు
జీవన జీవం
రేపన్న మధుర భావన
ఇవాల్టికన్నా వచ్చే రేపు
కచ్చితంగా మంచి మార్పు
కావాలి కొంచెం ఓర్పు
అదిగో వెలుగుతోంది తూర్పు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి