మంచుశిఖరానివో;-సాహితీసింధు సరళగున్నాల
(తేటగీతులు)

మంచుదుప్పటి కప్పియునంచులందు
దేశభాగ్యమ్ము నిల్పెడి ధీరచరిత
నీవు రక్షింప ప్రాణాలు నిల్చియుండు
కీర్తి భారతావనిలోన స్ఫూర్తిదాత

మంచుదుప్పటికట్టిన మాన్యచరిత
నీదు దర్శనభాగ్యమ్ము నింపు శాంతి
యేల చేరుదు నీదరి నెరుగనైతి
పాలచంద్రుని వాసమ్ము పరమ సుఖము

కామెంట్‌లు