ఎండకు జై! ;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఎండలమ్మా ఎండలు
మండిపోయే ఎండలు
దాహం వేసే ఎండలు
వేడినిచ్చే ఎండలు
చెరువులన్నీ ఎండాలీ
నింగికి నీరూ చేరాలీ
నల్లని మబ్బులు పుట్టాలీ
చక్కగ వానలు కురవాలీ
పంటలు దండిగ పండాలీ
ప్రజలు సుఖముగ ఉండాలీ
అందుకె ఎండలు కావాలీ
ఎండలకందుకె జైజైజై !!

కామెంట్‌లు