అమ్మ మనసు! అచ్యుతుని రాజ్యశ్రీ

 శూరసేనుడింకా నూనూగు మీసాలవాడే!కొత్తగా రాజుసైన్యంలో చేరాడు.కానీ త్వరగా అన్ని యుద్ధవిద్యలు నేర్చుకుంటున్నాడు.సేనాని అన్నాడు "శూరా!మంచి ఉషారుగా తెలివితేటలతో ఉన్న నీవు  రాజుగారి అంగరక్షకునిగా అందరి మెప్పు పొందావు.ఎల్లుండి రాజుగారి తో కలిసి దండయాత్ర కి బైలుదేరాలి.యుద్ధభూమిలో నీసత్తా చాటాలి.""చిత్తం!మాఅమ్మ  నాన్నమ్మ  అనుమతి తీసుకోవాలి."అన్నాడు శూరసేనుడు."నాన్న ఈరాజుగారి భటుడిగా పనిచేశాడు. కొడుకు పోయిన దు:ఖంలో ఉన్న నాన్నమ్మ  భర్తను పోగొట్టుకున్న మాఅమ్మ బాధ్యత నాదే!" సేనాని అన్నాడు "అలాంటప్పుడు సైన్యంలో ఎందుకు చేరావు?ఓమామూలు భటుడిగా చేరకపోయావా?""అయ్యా! సైన్యం లో ఐతే త్వరగా ఉద్యోగం దొరుకుతుంది. పైపదవులకి ఎగబ్రాకవచ్చు.ప్రతినెలా ఠంచన్ గా జీతం కావల్సిన సరుకులు ఇంటికి వస్తాయని చేరాను"ఉన్న విషయం చెప్పాడు. రాజు కి ఈమాట చేరవేశాడు సేనాని!రాజుకి వెంటనే తనపాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. తండ్రి పోగానే పట్టపురాణి ఐన తన తల్లి  మహామంత్రి సాయంతో తనను గద్దె ఎక్కించిన రోజులు కళ్ళలో మెదిలాయి.సేనాని శూరసేనుడి ఇంటికి వెళ్లి "అమ్మా!ఎల్లుండి రాజుగారితో కలిసి నీకొడుకు జైత్రయాత్రకి బైలుదేరాలి"అన్న మాటలు వింటూనే తల్లి  నాన్నమ్మ దిగాలుపడ్డారు.ఆవృద్ధురాలు ఇలాఅంది"బాబూ!కొడుకుని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలిని.నాకోడలి మొహంచూడండి అయ్యా!మనవడికి చిన్న నౌకరీ ఐనా ఫర్వాలేదు. మాకళ్లెదుట ఉంటే చాలయ్యా!" అని భోరుమంది.మారువేషంలో సేనాని తో వచ్చిన  రాజు మనసు కరిగింది."అలాగే అవ్వా! రాజు కి చెప్పి ఒప్పిస్తాము"అని సేనాని తో కలిసి వెనుతిరిగాడు.రాజకుటుంబాలలో కన్నా పేదవారి ఇంట్లో ప్రేమబంధాలు తల్లి మనసు  గ్రహించాడు.తల్లి  మహారాణిగా తను స్వయంగా ఆలనాపాలనా చూడలేదు. దాసీలచేతిలో పెరిగాడు.కానీ రాచరికపు రక్తబంధంకన్నా సామాన్య ప్రజల ఆత్మీయత కన్నప్రేమ ఎంత అపురూపమైంది"అనే ఆలోచనలో పడ్డాడు రాజు 🌹
కామెంట్‌లు