బాలలంత దివి నుండి
దిగివచ్చిన దేవతలు
అందరినీ మురిపించే
కమనీయ వేషధారులు
!!బాలలంత!!
బాలలు నవ్వితే
విరిసిన పున్నమి
కాంతుల అలలు
భువనమంత నిండుతాయి
ఆ అలల సవ్వడులు
!!బాలలంత!!
బాలలు కదిలితే
రకరకాల వన్నెల
పూల యేరులు
భువినిండా గుబాళించు
సుమధురసౌరభాలు
!!బాలలంత!!
బాలలు పాడితే
జగమంతా వినిపించే
ఎంచక్కని గేయం
మది ఎంతో ప్రీతి జెందు
సమ్మోహన భావం
!!బాలలంత!!
బాలలు ఆడితే
చుక్కల సీమలో
హరివిల్లు నాట్యం
మేఘమాల నడకలో
కదలిన మెరుపుల హారం
!!బాలలంత!!
బాలలు ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి