కర్ణుడు;-జి.లింగేశ్వర శర్మ
ధ్యానముజేయగమంత్రము
మానసమందునదలంచిమహిమనుగనగన్
భానుడువరముగనొసగిన
భానునితేజమునవెలుగుబాలకుడితుడున్

స్నేహము జేసెనుకర్ణుడు
ద్రోహమునెన్నడుసలుపకధుర్యోధనుతో
సాహాయమ్మునుమరువక
దేహమువీడెంతవరకుధీమంతుడిగన్

అడిగినవెంటనెపరులకు
తడబడకుండనునొసంగిదానములెన్నో
పుడమిన స్థిరముగనిలచెను
కడుయశముగడించిదానకర్ణుడిపేరన్

సాధనతోవిలువిద్యను
బోధనలువినుచుగురువులబుద్ధిగనేర్చిన్
బాధలుభరించిమిక్కిలి
రాధేయుడునంగదేశరాజుగమారెన్

సూతసుతుడవనికర్ణుని
జాతినినిందించినతానుజడుపకనింతన్
ఖ్యాతినిగడించెమిక్కిలి
దాతగవీరుడిగనిల్చిధైర్యముతోడన్


కామెంట్‌లు