The woods are lovely, dark and deep.
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep....
ఈ మాటలు నేను డిగ్రీలో చదివినవి. రాబర్ట్ ఫ్రాస్ట్ అనే కవి రాసాడు. ఎందుకో గుర్తుకొచ్చాయి చెప్పలేను గానీ ఈ మాటలు జవహర్ లాల్ నెహ్రూకి ఎంతో ఇష్టమైనవి. ఆయన తలగడ కింద ఈ మాటలుండేవని అత్యంత సన్నిహితుడొకరు చెప్పారు.
అడవులు మనోహరమైనవి. చీకటైనవి. లోతైనవి....కానీ నిలబెట్టుకోవలసిన వాగ్దానాలున్నాయి. పడుకునేలోపు ఎన్నో మైళ్ళ దూరం సాగాలి...అంటూ ఫ్రాస్ట్ చెప్పాడు....ఎవరికైనా మాటిస్తే నిలుపుకోవడం ఎంతో ముఖ్యం. ఆరునూరైనా మాట నిలుపుకోవడం అనేదెంతో ముఖ్యం. లేకుంటే మనమీద ఇతరులకున్న నమ్మకాన్ని కోల్పోతాం. అందుకేనేమో నేను ఎవరికీ మాటివ్వలేదు. కానీ ఆ నాలుగు పంక్తులైతే గుర్తుండిపోయాయి.
అదలా ఉండనిచ్చి ఈ మాటలు రాసిన కవి రాబర్ట్ ఫ్రాస్ట్ గురించి ఓ నాలుగు ముక్కలు చూద్దాం. అతను సుప్రసిద్ధ అమెరికన్ కవి. సాహితీ ప్రక్రియలో నాలుగు సార్లు అత్యంత ప్రతిష్టాకరమైన పులిట్జర్ అవార్డు పొందారు.
1874 మార్చి 26న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించిన ఫ్రాస్ట్ తండ్రి ఓ స్కూలు మాష్టారు. పత్రికా రచయితకూడా. అతని తండ్రి సైన్యంలో చేరడంకోసం ఇంట్లోంచి పారిపోయి పట్టుబడి తిరిగీ ఇంటికొచ్చేసినా సైనిక వీరులను మరచిపోలేదు. సైన్యంలోని ఓ వీరుడిపేరే తన కొడుకుకి రాబర్ట్ అనే పేరు పెట్టాడు.
తండ్రి మరణానంతరం ఫ్రాస్ట్ తాతయ్య ఇంట పెరిగాడు. తాతయ్య ఇంటికి దగ్గర్లో ఉన్న హైస్కూల్లో చదువుకున్నాడు. అతను తన మొదటి కవితను హైస్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే రాశాడు.
డార్ట్ మౌత్ కాలేజీలో చేరినప్పటికీ చదువుమీద ఆసక్తి లేక మూడు నెలలకే బయటకు వచ్చేశాడు. కొంతకాలానికి ఓ స్కూల్లో మిష్టారుగా పని చేశాడు. అలాగే ఓ పత్రికలోనూ పని చేశాడు.
అతను తన మొదటి కవిత My Butterfly: An Elegy అనే తన మొదటి కవితకు పదిహేను డాలర్లు పారితోషికంగా పొందాడు. 1894లో ఈ కవిత న్యూయార్క్ ఇండిపెండెంట్ అనే పత్రికలో అచ్చయ్యింది.
న్యూహాంప్ షైర్లో తమ సొంత కోళ్ళ ఫాంను తొమ్మిదేళ్ళపాటు చూసుకున్న ఫ్రాస్ట్ పొద్దున్నే నిద్ర లేచేవాడు. కోళ్ళ ఫాంకి వెళ్ళేలోపు కవితలు రాసేవాడు.
1912లో కోళ్ళఫాంను అమ్మేసి ఇంగ్లండుకి వెళ్ళి స్థిరపడ్డారు. 1913లో అతను రాసిన కవితలు "ఎ బాయిస్ విల్" అనే శీర్షికతో తొలి కవితా సంపుటి వెలువడింది. ఈ తొలి కవితా సంపుటికి ఎజ్రా పౌండ్ రాసిన సమీక్షతో ఊహించని రీతిలో ఆదరణ లభించింది.
ఇంగ్లండులో ఉన్న రోజుల్లోనే ఎడ్వర్డ్ థామస్, హ్యూమ్ వంటి ప్రముఖ కవులతో పరిచయమేర్పడింది. ఫ్రాస్ట్ కవితలు ప్రాచుర్యం పొందడానికి వెలువడడానికి ఈ కవిమిత్రులు సాయం చేశారు. 1914లో నార్త్ ఆఫ్ బాస్టన్ అనే కవితాసంపుటికి విశేష ఆదరణ లభించింది.
మొదటి ప్రపంచ యుద్ధంలోకి బ్రిటన్ దిగటంతో ఫ్రాస్ట్ మళ్ళీ అమెరికాకొచ్చేశాడు.రాతను మాత్రం కొనసాగించాడు. అమెరికాలో ఓ విఖ్యాతకవిగా మన్ననలందుకున్నాడు.
ఇతని కవితలు తేలికమాటలతో అన్ని వర్గాలవారిని ఆకట్టుకున్నాయి. పెరిగిందంతా నగరాలలోనే అయినప్పటికీ అతని సాహిత్యమంతా పల్లెవాతావరణం, సామాజిక స్పృహ, తత్వార్థాలకు అద్దం పట్టేది.
1924లో New Hampshire: A Poem with Notes and Grace Notes అనే సంపుటికి మొదటిసారి పులిట్జర్ అవార్డు పొందిన ఫ్రాస్ట్ ఆ తర్వాత 1931, 1937, 1943లలోనూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. మరెవరికీ ఇన్నిసార్లు ఈ అవార్డు దక్కలేదు.
కాలేజీలో డిగ్రీ పొందని ఫ్రాస్ట్ సాహితీసేవను గుర్తించి ప్రిన్ స్టన్, ఆక్స్ ఫోర్డ్, కేంబ్రిడ్జ్ వంటి నలబై విశ్వవిద్యాలయాలు పోటీపడి అతనికి గౌరవ డాక్టరేట్ పట్టాలిచ్చి సత్కరించాయి. తుదిశ్వాస వరకూ రాస్తూ వచ్చిన అతను తన ఎనభై తొమ్మిదో ఏట 1963 జనవరి 29న కాలధర్మం చెందారు.
అతని కవితలు జాన్ ఎఫ్ కెనడీ, నెహ్రూ, జార్జ్ ఆర్. ఆర్. మార్టిన్ వంటి ఎందరో ప్రముఖులకు స్ఫూర్తిదాయకంగా ఉండేవి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి