వెంకటాపురంలో నాగయ్య అనే రైతు ఉండేవాడు. తనకు వున్న మూడెకరాల పొలంలో కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ , వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ వుండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. ముగ్గురినీ నాగయ్య దంపతులు చిన్నప్పటి నుండి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. తమకు వున్నా లేకపోయినా, కొడుకుల సుఖాలలో ఏం లోటు రాకుండా చూసుకున్నారు. అయితే ముగ్గురు కొడుకులలో ఐక్యత అనేది పుర్తిగా లోపించింది. ముగ్గురుకి అభిప్రాయబేధాలు బాగా ఎక్కువే. ఒక్క విషయంలో కూడా ఒకే అభిప్రాయానికి రాలేకపోయేవారు. ఎప్పుడూ వాదులాడుకోవడం చేస్తుండేవారు. వారి ప్రవర్తన నాగయ్య దంపతులకు ఏ మాత్రం నచ్చేది కాదు. చాలాసార్లు కలిసి వుండమని చెప్పి చూసారు కాని ఆ ముగ్గురూ వారి మాటల్ని పట్టించుకుంటే కదా !
పెళ్ళయ్యి కోడళ్ళు వచ్చాక ముగ్గురి కుటుంబాల మధ్య విభేదాలు పెరిగి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడం ప్రారంభమయ్యింది.వీరి వ్యవహారం చూసి నాగయ్య దంపతులకు తలలు పట్టుకోవడమే శరణ్య మయ్యింది.
నాగయ్య వృద్ధాప్యంలో పడ్డాడు. తన ఆస్థి పాస్థులను, వృత్తిని కొడుకులకు సమానంగా పంచి తాను విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.అయితే ఈ పంపకాల ముందు కొడుకుల మధ్య ఐక్యత పెంచడం తన తక్షణ కర్తవ్యంగా భావించాడు.
ఒకరోజు ముగ్గురినీ పిలిచి మీ ముగ్గురికీ ఒక పరీక్ష పెడుతున్నాను. ఇందులో ఉత్తీర్ణులైన వారికి నా మొత్తం ఆస్తి రాసి ఇచ్చేస్తాను అని అన్నాడు ఆ మాటలు వినగానే ముగ్గురికీ ఎంతో ఆశ పుట్టింది. కాస్త కష్టపడి పరీక్షలో గెలిస్తే మొత్తం ఆస్తి దక్కించుకొని జీవితమంతా సుఖంగా బ్రతికేయవచ్చు అనుకున్నారు.
ముగ్గురు సరేనని తలూపాక నాగయ్య ఒక్కొకరికి పదేసి కట్టెల ఉన్న మోపును ఇచ్చి మోపును విప్పదీసి ఒక్కొక్క కట్టెను చేతులతో విరగొట్టమన్నాడు.శారీరక దారుఢ్యం కలిగిన ముగ్గురూ ఓస్ ఇంతేనా అనుకొని మోపును విప్పదీసి ఫట్ ఫట్ మంటూ కట్టెలను విరగొట్టేసారు. తర్వాత నేను తక్కువ సమయంలో విరగొట్టాను అంటే నేను తక్కువ సమయంలో విరగొట్టాను అని వాదులాడుకోసాగారు.
అప్పుడు నాగయ్య ఆ ముగ్గురినీ శాంతపరచి పది కట్టెల ఉన్న ఒక మోపును ఇచ్చి, ఇప్పుడు ఈ మోపును విప్పదీయకుండా , ఇందాక బ్రద్దలు కొట్టినట్లు మొత్తం మోపును బద్దలు కొట్టండి అని చెప్పాడు. సరేనని పెద్దవాడు తన ప్రయత్నం ప్రారంభించాడు. మొత్తం బలాన్ని ఉపయోగించి మోపుపై ఎన్ని దెబ్బలు వేస్తున్నా బద్దలుకొట్టలేకపోయాడు.చివరకు నీరసం వచ్చి కింద కూలబడిపోయాడు.రెండోవాడు కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు. కండలు చూసుకుంటూ వచ్చిన చిన్నవాడు ఎంత ప్రయత్నించినా విరగొట్టలేకపోయాడు.
బిక్కమొహాలు వేసుకొని నిల్చున్న వారి ముగ్గురితో నాగయ్య ఇలా అన్నాడు. చూడండి, ఒక్కొక్క మోపు నుండి కట్టెలను విడిగా తీసాక వాటిని మీరు సులభంగా విరగొట్టగలిగారు. అదే వాటిని విడదీయకుండా ఒకే మోపుగా వుంచినట్లయితే విరగొట్టడం మీ వలన కాలేదు. దీనికి కారణం కట్టెలన్నీ ఒకే మోపుగా కలిపి ఉండడం.ఐకమత్యమే మహా బలం, విడివిడిగా వున్నప్పుడు బలహీనమైపోయిన కట్టెలు కలిసి ఉన్నప్పుడు ఎంతో బలంగా తయారయ్యాయి. కట్టెలైనా, మనుష్యులైనా అంతే. కలిసి వున్నప్పుడు వారిని ఓడించడం ఎవరివల్లా కాదు. ఈ విషయం మీకు అర్ధమయ్యేలా చెప్పడానికే నేను ఈ తంతు నిర్వహించవలసి వచ్చింది. కాబట్టి ఇకనైనా కలిసి వుండండి. కలిసి బ్రతకండి, కలిసి ఎదగండి. కలిసి వుంటేనే కలదు సుఖం అన్న నానుడిని మనస్సుకు ఒంట బట్టించుకొండి"
తండ్రి మాటలు ఆ ముగ్గురికీ బాగా అర్థమయ్యాయి. ఇంతవరకు తమ ప్రవర్తనకు తండ్రికి క్షమార్పణలు చెప్పి, ఇకపై కలిసి వుండాలని నిర్ణయించుకున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి