ప్రక్రియ:వచనo
*******
సృష్టి లోని బీజాన్ని
మోసే క్షేత్రంగా..
ఒకటి కాదు రెండు కాదు
నవ మాసాలపైన,
తాను ఆహారం తీసుకొనే
గర్భంలో ఒక ప్రక్కన
జాగ్రత్తగా దాచుకొని...
పర్యవసానంగా తిరస్కరించే
శరీరాన్ని బుజ్జగిస్తూనే...,
పెరుగుతున్న శిశువువు గురించి
కొంత ఆందోళన,మరింత మమతా
కలగలిసిన తత్వంలో
ఇతరమైన కౌటుంబికసమస్యల
మధ్యలోనే..
వేవిళ్ల బాధలు అనుభవంతో
పుట్టింటి నుండి అందే
ఆప్యాయత ఆధారంగా,
నిబ్బరం, నిండుతనమూ
ఫలవంతమైన పండ్ల చెట్టులా
అమ్మాయి అమ్మగా మారే క్రమంలో
ఎన్నో మార్పులు !
తొలి నెలలు సిగ్గు, అయోమయం
మలిరోజుల్లో మహా నీరసం
కళ్ళుతిరిగి పడటం..
ఒక్క ముద్దలోపల ఇమడనిస్థితిలో
బిడ్డకోసమే తినడానికి ప్రయత్నం
ఉన్నదానిలో రుచిని చూస్తూ
ఇద్దరివంతు తినాలనే
పెద్దల మందలింపుతో
ప్రసవం దగ్గరపడుతున్నపుడు
తెలియని భీతి నిద్రరాని స్థితి
నొప్పులు భరిస్తూ వైద్యం ఆశిస్తూ
కనులముందు కన్నయ్య (మ్మ )
ప్రత్యక్షమయ్యాక
అన్నీ మరిచిన మాతృత్వం
దివ్యం, భవ్యం.అద్భుతం !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి