భారత వజ్రోత్సవ వేడుకలు;-మచ్చ అనురాధజి‌.ప.ఉ.పా .కుకునూర్ పల్లి, కొండపాక మండలం లోని సిద్దిపేట జిల్లా.
సీసమాలిక పద్యం
=============
భారత దేశము బానిస బ్రతుకులో
మ్రగ్గుచుండగ జూసి మదన పడియు
స్వాతంత్ర్య సమరాన సాగిరి ముందుకు
 ప్రాణ త్యాగము జేసి పట్టుబట్టి,
నింగిలో బావుటా నీరాజనముతెల్పె
భారతీయులు గొప్ప పటిమ నెంచి ,
పింగళి వెంకయ్య ప్రీతితో కూర్చెను
జాతిపతాకము చక్కగాను,
రంగురంగుల లోన రమణీయతను  తెల్పు
భావాలనిమిడించి భవ్యముగను ,
మువ్వన్నెలు కలిగి ముచ్చటైనది జెంఢ
పరపీడ తొలగించె పరమ దివ్వె,
తరతరాలకు నిధి తరగనిదీ జెండ
వీరుల గుర్తుగా వెలిగెనిచట,
వజ్రోత్సవములందు భారతీయుల జెండ
రూపుదిద్దుకొనియు లోకమందు,
యింటింట  ప్రతియింట యింపుగా జంఢాలు
రెపరెపలాడుచు రివ్వున  రివ్వున
యెగురు చున్నది జంఢ  యెంతొ యెత్తు 
వీరుల త్యాగాల  విలువలు తెలిపెడి
భారతీయ పతాక భవ్య చరిత 

తేటగీతి
ధైర్యసాహసములుగల ధీర జనులు ,
అమరులైనిలిచారిల యవని యందు,
యెందరో మహనీయులు నందరికిని,
వందనములు తెలిపెదను డెందమలర.

🙏🙏

కామెంట్‌లు