ఎన్నో యుద్ధాలు జరిగాయి
ఎన్నో రాజ్యాలు మట్టిలో కలిసిపోయాయి
ఎంతో రక్తం ఏరులై పారింది
ఎంతో హింస చెలరేగింది.
కిరీటం కోసం, ఆధిపత్యం కోసం
రాజ్యం కోసం, సింహాసనం కోసం
భూమి కోసం భుక్తి కోసం
సమాన వాటా, సరిహద్దుల కోసం
వాదాలు,వివాదాలు,పోరాటాలు
పోరులు, రణాలు,యుద్ధాలు
సమరాలు, సంగ్రమాలు
కొట్లాటలు జరుగుతున్నాయి.
రక్తాలు, శవాలు,గుట్టలు
పెరుగుతున్నాయి తప్ప
ఫలితం మాత్రం శూన్యం.
అహింస యే పరమ ఔషధం.
అహింస వల్లే
స్వాతంత్ర్యం వచ్చింది
స్వేచ్ఛ లభించింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి