బాలుకు 'సాహితీ ప్రవీణ 'పురస్కారం

 శ్రీకాళహస్తి: పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు ,కవి, రచయిత, మిమిక్రీ కళా కారులు కయ్యూరు బాలసుబ్రమణ్యం 
సాహితీ ప్రవీణ పురస్కారాన్ని అందుకున్నారు. ఆదివారం తిరుపతి యూత్ హాస్టల్ లో మాతృభాషా
దినోత్సవం పురస్కరించుకొని ఉమెన్ అండ్ యూత్  ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని
ఇచ్చినట్టు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అంకయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో సాహితీ వేత్తలు డాక్టర్ భీమన్న, డాక్టర్ మౌని, పిచ్చాటూరు యం.ఈ.ఓ.హేమ మాలిని,నడ్డి నారాయణ ,సుబ్బరాయలు తదితరులు పాల్గొన్నారు.ఈ అవార్డు రావడం పట్ల పలువురు ఆయనను అభినందించారు

కామెంట్‌లు