పసిడి కిరణాలు ;-ఎం. వి. ఉమాదేవి
(ఆట వెలదులు )
==============
పసిడి కిరణరశ్మి పావన తీరమై 
సర్వ జనుల శుభము సంతరించె 
హరితభూమి యయ్యె హాలికుల్ శ్రమలంద
మేఘమాలలెల్ల మేలుగూర్చె !

తోడితీసుకొనిన తోయజమ్ములతోడ
వసుధపైన గురియు వర్షములును 
వనములెల్ల మురియు వాసిఫలములిచ్చి 
పక్షిపశువుబెరుగు పరిధిలేక !!


కామెంట్‌లు