ఇద్దరు మల్లయుద్ధవీరులు రుస్తుం సొహ్రాబ్ లు కన్నతండ్రి కొడుకులు!కానీ వారికి ఆవిషయం తెలీదు. ఒకరిమొహాలు ఒకరు చూసుకుని ఎరుగరు.ఇద్దరు శత్రుదేశాలకి చెందినవారు.ఇరాన్ సేనాని రుస్తుం మహాబలశాలి మధ్యవయస్కుడు.ఆనాటి తురాన్ దేశానికి చెందిన యువకుడు సొహ్రాబ్! ఆరెండు దేశాల మధ్య ఎప్పుడూ యుద్ధమే! వారి యుద్ధభూమి మధ్యగా ప్రవహించే ఆక్సస్ నదీతీరం!ఓటమి ఎప్పుడూ తురాన్ దే!అందుకే తురాన్ ఓప్రతిపాదన చేసింది. "మాసొహరాబ్ వీరునితో మల్లయుద్ధం కత్తి యుద్ధం చేసేవారు ఉంటే స్వాగతం పలుకుతున్నాం.వారి ఓటమి గెలుపులతో ఆదేశం గెలిచినట్లు ఒప్పందం చేసుకుందాం. జననష్టం సైన్యం ధననష్టం ఉండవు ఇరుదేశాలకి.మాసొహరాబ్ గెలిస్తే మీరు ఓడినట్లే ఒప్పుకుని తీరాలి. " సరేనని ఆరాజ్యాలు అంగీకరించటంతో ఆయోధులమధ్య మల్లయుద్ధం మొదలైంది. రెండు కొండలు ఢీకొన్న విధంగా పోరు సాగింది. "అయ్యా!మీరు రుస్తుం గారేనా?"సొహ్రాబ్ ప్రశ్నించాడు.""నీకెందుకురా ఆవివరాలు? దమ్ముంటే గదాయుద్ధం చెయ్యి " అని పొగరుగా విజృంభించి ఓటమిని రుచిచూశాడు.రుస్తుం ఆవేశంతో కత్తి దూశాడు."నాన్నా!నేనునీకొడుకుని"పెద్దగా గావుకేకవేశాడు."నీవు తురాన్ లో ఫాతిమా అనే ఆమెను పెళ్లాడావు.రుస్తుం నాతండ్రి అని ఆమె నాతల్లి ఫాతిమా చెప్పింది.నామెళ్లో మాఅమ్మ వేసిన బంగారు పతకం ఇదినాన్నా! అమ్మను కోల్పోయాను బాల్యం లోనే!నిన్ను చూడాలనే ఆశతో సైన్యం లో చేరి అన్నివిద్యల్లో ఆరితేరాను.ఇలా నీచేతుల్లో గాయపడి చనిపోతున్నాను.నాచావుతో ఇరాన్ తురాన్ దేశాలు పగ శత్రుత్వం మరిచి మిత్రులుగా మెలగాలన్నది నాఅంతిమకోరిక!"అలా సొహ్రాబ్ చావుతో మానవత్వం మేలుకుంది.మరి నేడు రష్యా యుక్రైన్ యుద్ధంలో ఎంత జననష్టం ఆస్తినష్టం జరుగుతోందో మనం చూస్తున్నాం. దురహంకారం స్వార్ధం అసూయ లే యుద్ధం కి మూలం అని మహాభారత యుద్ధం చెప్తోంది కదూ🌹
రుస్తుం-సొహ్రాబ్! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి