పదాలతో దత్తపది;-సాహితీసింధు సరళగున్నాల

 కరుణ తరుణ వరుణ భరణ
==================
కరుణన్నింపుము కామితార్థ వరదా కైవల్య ప్రాప్తమ్మునన్
తరుణమ్మెప్పుడుసంక్రమింపగలదో ధైర్యమ్ము , సంపాదనా
భరణమ్మైనిల నిల్చుచుండు వరమున్ ,బ్రాతాళి,సంతానమున్ 
వరుణుండుంచెడి రీతి జల్లు కురియన్ భధ్రమ్మగున్ జీవులున్
కామెంట్‌లు