కవయిత్రి జ్యోతి వైద్య గారికి ముత్యాల హార పురస్కారం

 ఆదిలాబాదు చెందిన కవయిత్రి, విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలకు  ముత్యాలహార పురస్కారం వరించింది.శ్రీమతి జ్యోతి వైద్య గారు తెలుగు భాష మీద ఆసక్తితో ఇప్పటి వరకు వివిధ  ప్రక్రియలో  కవితలు, గేయాలు, పద్యాల తోపాటు ముత్యాలహార ప్రక్రియలో శతాధిక ముత్యాల హారాలు లిఖించారు. ముత్యాలహార  నూతన లఘు కవిత ప్రక్రియలో  సామాజిక అంశాల పై (108) పద్యాలు అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన సందర్భంగా శ్రీమతి జ్యోతి వైద్య విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలుకు ముత్యాలహార పురస్కారాన్ని ఇటివల వాట్సాప్ వేదికగా ఉట్నూర్ సాహితీ వేదిక అధ్యక్షులు కవన కోకిల జాదవ్ బంకట్ లాల్, ప్రధాన కార్యదర్శి ముంజం జ్ఞానేశ్వర్, ప్రచార కార్యదర్శి ఆత్రం మోతిరామ్, ప్రక్రియరూపకర్త. రాథోడ్ శ్రావణ్ గారి సౌజన్యంతో అందజేశారు. ఈ పురస్కారం రావడం పట్ల ఉషావే కవులు, కుటుంబ సభ్యులు, బంధువులు సాహితీ అభిమానులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు