సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 బంధం...అనుబంధం..
   ******
కడుపున పుట్టిన బంధాలు కొన్ని.కలుపుకుపోయే బంధాలు కొన్ని, సోదర సోదరీ భావనతో అనుకోకుండా ఏర్పడే అనుబంధాలు కొన్ని.
అడుగడుగునా అక్కా చెల్లెళ్ళకు తోడుగా, అన్నా తమ్ముళ్ల  అభివృద్ధిని, ఉన్నతిని కాంక్షించే ఆజన్మాంత సహోదర బంధం ఎంత గొప్పదో...
అనుకోకుండా తారసపడే  బంధాల్లో సోదర సోదరీ అనుబంధం మరింత గొప్పది. కష్ట సుఖాల్లో కంటికిరెప్పలా కాపాడుకునే విధంగా ఉంటుంది.
 అన్నా, తమ్ముడూ, చెల్లీ అక్కా అని పిలుచుకోవడంలో ఎక్కడో ఏమూలో హృదయంలో చిరు సందేహాలు పటాపంచలై ,ఆ పిలుపులకు తగినట్లుగా ఉండే విధంగా అంతరాత్మ ఆలోచనలను, ప్రభావితం చేస్తుంది.
ఆ పిలుపుకు కట్టుబడిన మనసు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరికొకరు హాని తలపెట్టనీయదు.
ఆ పిలుపుల్లో ఉన్న ఔన్నత్యం అదే.
 అలాంటి మహోన్నత భావన రావడానికే పసితనం నుండే పాఠశాలల్లో ....
నా సహోదరులు అంటూ ప్రతిజ్ఞ చేయిస్తుంది. జాతి మత కుల భేదాలు లేకుండా సోదరభావంతో మెలగాలని ఉద్బోధిస్తుంది.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు