వినాయకా! అచ్యుతుని రాజ్యశ్రీ
వీడేనమ్మా వినాయకా!
వీడే వీడే వినాయకా!

శివపార్వతుల కొడుకంట!
కుమారస్వామి అన్నంట
సిద్ధి బుద్ధుల మగడంట 
క్షేమం లాభం తండ్రంట!

ఏకదంతుడితడండీ!
గుజ్జురూపుని కనరండీ
బొజ్జల దేవుని కొలవండీ 
గజానను డితడండీ!
చేటంత చెవుల వాడండీ
కుడుము ఉండ్రం చాలండి 
భక్తితో గుంజీలు తీయండి 
గరికపూజలే మేలండి 

ఆదిగపూజలు అందేవాడు 
మెల్లని నడకల వాడండీ!
చల్లని చూపుల అయ్యండీ!
విద్యల తండ్రి ఇతడండీ!

బుడిబుడి నడకల పిల్లలకు 
సుద్దులు బుద్ధులు చెప్పయ్యా 
మూషిక వాహన రావయ్యా!
శాంతి సహనం నేర్పయ్యా🌷

కామెంట్‌లు