బాలగగాధర్ తిలక్--సాహితీసింధు సరళగున్నాల
రత్నగిరిలోన జన్మించి రత్నమటుల
దేశ కాంక్షయను తపన నాశయముగ
ముందుకేగిన తిలకుకు వందనముల
జేయకదిలిరి జనులు నజేయుడితడు

బాల్యమందువివాహము బంధురమ్ము
ననుచునెదిరించి పెళ్ళిళ్ళనాపుజేసి
విద్యయందున్న మధురమ్ము విషదపరచి
బడికికొనసాగ చైతన్య పరచెనితడు

కామెంట్‌లు