పండిత మదన్ మోహన్ మాలవ్యా! అచ్యుతుని రాజ్యశ్రీ

 కాశీ హిందూ విశ్వవిద్యాలయం నెలకొల్పిన ఆయన మరుగున పడిన మాణిక్యం!విరాళాలు సేకరించారు. ఎన్నో అవమానాలు భరించారు.ఆనాటి నిజామ్ "పైసా విదల్చను"అని అవమానించాడు. సరిగ్గా అప్పుడే ఓఘటన జరిగింది. ఓసేఠ్ చనిపోతే శవయాత్రలో బంధువులు పైసలు వెదజల్లుతున్నారు.మాలవ్యా వాటిని ఏరుకుంటున్నారు.జనం గుర్తు పట్టి అడిగితే "ఏంచేయను? మీ నిజామ్ చిల్లిగవ్వ ఇవ్వనన్నాడు.నేను బెనారస్ వెళ్లాక"హైదరాబాద్ నించి ఎంత విరాళం సేకరించావు?అని అడిగితే చెప్పాలి కదా జవాబు! పిసినారి నిజామ్ పైసా విదల్చలేదు.కానీ శవంమాత్రం నాణాలు ఏరుకునే సాయంచేసింది అని  దండోరా వేస్తాను."ఆమాటల బాణాలు నిజామ్ కి  తగిలి స్వయంగా  మాలవ్యా దగ్గరకు వెళ్లి క్షమార్పణకోరి విరాళం ఇచ్చాడు.ఆభవ్య విశ్వవిద్యాలయం  ఎందరినో తీర్చి దిద్దింది.ఆయన స్వయంగా హాస్టల్ తనిఖీ చేసేవారు. గదిగోడపై ఓవిద్యార్ధి  లెక్కలు డొక్కలు రాయడం చూసి ఇలా అన్నారు"నాయనా! ఈభవంతిలోని ప్రతి ఇటుక నారక్తపుబొట్టు!ఇలా గోడలు ఖరాబు చేయకు."అని స్వయంగా తనజేబులోంచి దస్తీ తీసి తుడిపారు.ఓసారి  ఆయన సభలో మాట్లాడేటప్పుడు గిట్టని వారు పెద్దగా కేకలు అరుపులతో గందరగోళం సృష్టించారు.ఆఅల్లరిమూకలో ఒకడిని స్టేజిపైకి పిల్చి" మీఅల్లరి కారణం?నాతప్పు వివరించు!" అని శాంతంగా అడిగారు."మీరు ముఠాకక్షలు పెంచుతున్నారు. ఓదళాన్ని పెంచి పోషించి మనుషుల మధ్య వైరం సృష్టిస్తున్నారు". మాలవ్యా జవాబు ఇది"బాబూ! నేను ఏదళానికి చెందను.నాకున్న ఒకేఒక దళం ని నేను ప్రాణం పోయేదాకా వదలను.ఎప్పుడూ నేను ఆదళ సభ్యుడినే!"అంటూనే జేబు లోంచి తులసి దళాలు తీసి చూపేప్పటికి"మాలవ్యాజీకి జై!"నినాదాలు పిక్కటిల్లాయి.
ఓసారి హాలెండ్ నించి యూనివర్సిటీ ని చూడాలని వచ్చారు.స్వయంగా మాలవ్యా వారికి చూపారు. ఇంతలో మీటింగ్ కి హాజరుకావాలి అని వార్త రావటంతో ఆబాధ్యతను  ప్రొఫెసర్ శేషాద్రికి అప్పగించారు. "పండిట్ జీ! గదితాళాలు వేసి ఉంటాయి.టైంకాగానే చప్రాసీ కూడా ఇంటికెళ్లి పోయాడు. ""శేషాద్రీ! బైట గాజుతలుపుల గుండా ఆవిభాగాన్ని స్పష్టంగా చూడవచ్చు. అలాగే దాని నిర్మాణం జరిగింది. " అప్పుడు అర్ధం ఐంది  ఆయన దూరదృష్టి! ఆరోజుల్లోనే  ప్రతి విభాగాన్ని బైటకి కన్పడేలా కట్టించిన ఆయన ప్రతిభకు ఆవిదేశీయులు ముగ్ధులైనారు.
మరి ఇలాంటి మహనీయుడు మదన్ మోహన్ మాలవ్యాని గూర్చి నేటి పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత పెద్దలదీ మీడియాది కూడా 🌷
కామెంట్‌లు