ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ముంబై కు చెందిన ప్రముఖ కవయిత్రి శ్రీమతి అద్దంకి లక్ష్మీ కి చోటు...





ముంబై కు చెందిన ప్రముఖ కవయిత్రి మరియు ముంబై మ్యునిసిపల్ కార్పొరేషన్ విశ్రాంత ఉపాధ్యాయిని శ్రీమతి అద్దంకి లక్ష్మి 
గారికి "మాతృమూర్తికి అక్షర నివాళి" అను సంకలనమునకు రచన చేసినందులకు  గాను 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్' లో చోటు లభించింది. 
తనకు కవయిత్రి గా మరింత బాధ్యత పెరిగిందని ఎంతో గర్వంగా ఉందని ఇలాంటి మంచి అవకాశం కల్పించిన నిర్వాహకులు డాక్టర్ బి. వి. వి. సత్యనారాయణ గారికి, డాక్టర్ శీలం రాజ్యలక్ష్మి గారికి ఎంతో ఋణపడి ఉంటానని ఆనందం వ్యక్తం చేశారు.
 ఈ సందర్భంగా తెలుగు భాషాభిమానులు, సాహిత్యాభిలాషులు, హితులు, సన్నిహితులు, స్నేహితులు శ్రీమతి అద్దంకి లక్ష్మి  గారికి అభినందనలు తెలిపి ఆమె మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.
కామెంట్‌లు
Unknown చెప్పారు…
హార్దికాభినందనలు లక్ష్మి గారు
💐💐💐💐💐💐💐💐
Unknown చెప్పారు…
హార్దికాభినందనలు లక్ష్మి గారు
💐💐💐💐💐💐💐💐