ఋణ'పాశం; -డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,మేడ్చల్.

 అవసరానికి అప్పు చేస్తే నిలువుదోపిడే.
లోన్ యాపుల మాయజాలంలో మానవత్వం కల్లే.
మార్ఫింగ్ ఫోటోల బరితెగింపులతో,
బ్రతుకులను ఆగమాగం చేస్తున్నారు.
అంతకంతకూ వడ్డీ పెంచుతూ,
బెదిరింపులకు పాల్పడుతూ,
ప్రాణాలను తోడేస్తున్నారు.
నక్షత్రకులై,కాబూలీవాలాలై
యమకింకరులై,మృగాలై
వేటాడుతూనే ఉంటారు.
మానాభిమానాల చక్రబంధంలో చిక్కి,
అచేతనులవుతున్నారు అమాయకులు.
గుడ్లు తేలేస్తున్నారు
సామాన్యులు.
పరుష పదజాలాలతో,
బ్లాక్ మెయిలింగులతో,
జీవితాలను చిందర-వందర చేసేస్తున్నారు.
'ఋణ'పాశాలు వేసి,
దా'రు'ణాలు యథేచ్ఛగా చేసేస్తూ,
మనుగడే ప్రశ్నార్థకం చేస్తున్నారు.
బంధాలను ఋణాలతో
తెంచుకుంటున్న వారు,
వ్యసనాల్లో నిండా మునిగిపోయి,
దిక్కుతోచని వారు,
అనేక లక్షణాలతో,
కొన్ని అవలక్షణాలతో,
తెలివిగా అల్లిన సాలెగూళ్ళలో చిక్కి,
అందులోనే మాయమైపోతున్నారు.
ఋణమే నరకమై విగతజీవులై వెళ్ళిపోతున్నారు.
ఋణానుబంధాలను తెంచేస్తూ,
కబంధ హస్తాలతో పట్టేస్తూ,
ఋణపాశాలకు చిక్కించుకొని,
నయాదందాలు నడుస్తూనే ఉంటాయి.
కామెంట్‌లు