విద్యావిధానమే విచ్ఛిన్నమయె నేడు
చదువులో నేర్పించు సంస్కారమే లేదు
నడవడిక,నైతికము తడబడెను బడిలోన
గుణకములె కావాలి, గుణమేల పిల్లలకు?
సర్కారు బడిలోన చదువెందుకుంటుంది?
ఏసి క్లాసుల్లోన ఎడ్యుకేషన్ మెండు
*అమరవీరుల త్యాగమన్యాయమౌతోంది*
*వజ్ర భారతి లెమ్ము! పగ్గాలు గైకొమ్ము!*-8
వైద్యమంతా నేడు వ్యాపార సరుకయ్యె
రోగి ముఖ్యము కాదు రోగమే ధ్యేయమౌ
అవయవాలకు వివిధ ఆసుపత్రులు కలవు
కోతలే పెడతారు కుట్లతో కుడతారు
రోగమేదైననూ రాగమొకటే కోత
జేబుకైనను సరే, జీవికైనను హరే
//అమరవీరుల//...14
తిన్నదరగక సగము తిండి లేకను సగము
ప్రగతి రాకెట్టేమొ పైపైకి పోతోంది.
తాగ నీరుండదిట తూగ బారులు మెండు
మిషను వాటరు చూస్తె మిన్నెగిరి కొడుతోంది
హరితహారముతోడ హరియించె కలుషితము
స్వచ్ఛ గాలిని పీల్చ వచ్చె గద కరోనా
//అమరవీరుల//.....20
సంక్షేమ పథకాల సాకుతో పాలకులు
మన సొమ్ము కాజేసె మాయజేస్తున్నారు
ఒక్క రూపాయికే ఉచిత బియ్యమునిచ్చి
బక్కోడి యాకలిని పనుపలేకున్నారు
ఆ"బంధు" ఈ"బంధు" అన్ని "బంధు"లనిచ్చి
రాబందులై మేసి రాటుదేల్తున్నారు
//అమరవీరుల// .....26
వజ్ర భారతమందు వ్యత్యాసములు చెరిగె
ఉన్నోడు,లేనోడు ఒక్కతీరుగ మారె
ఉన్నోడి ధనమంత ఉట్లలో ఊరించు
లేనోడి ధనమంత రెక్కలను కారించు
ఉన్నోడు కొండంత ఉండియును తినలేడు
లేనోడు గోరంత లేకుండి తినలేడు
ఉన్నోడి ఆస్తులు ఉరుకుతూ పెరుగుతయ్
లేనోడి అస్థులు లీనమై విరుగుతయ్
//అమరవీరుల// .....34
వజ్ర భారతమందు పంజరమునను చిక్కె
న్యాయమే దోషియై నాణెముకు దాసియై
చేయి తడిపితె చాలు చెల్లు నీ వాదమే
వాదోపవాదాలు వర్తించవికనప్డు
న్యాయమూర్తికి వాట, న్యాయవాదికి వాట
తీర్పుతో దావాకు తీరుతుందిక తీట
//అమరవీరుల// .....40
పోలీసు వారికిట పోటి లేనే లేదు
ఆటలో,పాటలో, అరుదైన వేటలో
కాలు మోపితె చాలు కనకవర్షము కురియు
వేలు చూపితె చాలు వేస్తారు కానుకలు
రక్ష కోసము వెళ్తె రాలేవు బయటకిక
"రికమండు" లేనిచో రిక్తమే పిటిషన్లు
//అమరవీరుల// .....46
గాంధీజీ కలగన్న గ్రామీణ భారతము
పట్టణపు సొగసుతో ఫరిడవిల్లుతునుంది
ఉచిత పథకాలతో ఊర్లన్ని పనిమాని
నిత్యోత్సవాలలో నిహితమై మునిగినవి
మూడు పుష్పములున్ను ఏడు ఫలముల తోడ
పంచాయితీ సభలు పరుగులే పెడుతుండె
//అమరవీరుల// .....52
ఎన్నికల పర్వమున ఎన్నెన్నో వింతలు
మధ్యమే వరదలై మభ్యపెట్టును నిన్ను
నా ఓటు కొనమంటు నడిరోడ్డుపై జనులు
ధర్నాలు చేస్తారు,దాడులను చేస్తారు
పదివేల కోట్లతో ప్రజల వోట్లను కొన్న
పార్టియే గద్దెక్కి పాల్పడును దోపిడికి
//అమరవీరుల// .....58
మేథావులందరికి మేలేమిటో తెలుసు
రాజకీయము వైపు రాలేరు,కనలేరు
పాలకులు చేసేటి పాపాల ననలేరు
ప్రజ మోసపోయేటి పద్ధతులు కనలేరు
మేథావి మౌనముగ మిన్నకుండిననాడు
దేశ గతి చెయిదాటి నాశమై మిగులింక
//అమరవీరుల// .....64
ఆకాశవీథిలో రాకాసి శస్త్రాలు
యుద్ధ మేఘాలయ్యి ఉరిమురిమి నిలిచాయి
అగ్ని పథమున నడువ హవిసయ్యె రైల్లన్ని
సాహసిక్యము చేసి సామర్థ్యమయె యువత
దేశరక్షణలోన దేబెరించెను నీచ
రాజకీయెత్తుగడ,రాజేయు ఛేష్టలును
//అమరవీరుల//.....70
కులములకు,మతములకు కుమ్ములాటలు పెట్టి
కుర్చినెక్కుట కొరకు కుట్రలను చేస్తారు
డెబ్బదేండ్లైననూ దెబ్బలాటలు పోవు
అధికారమొందుటకు ఆరనివ్వరు సెగను
తెల్లోడి దారిలో నల్లోడి పాలనిది
అమరవీరుల త్యాగమన్యాయమౌతోంది
వజ్ర భారతి లెమ్ము! పగ్గాలు గైకొమ్ము!.....75
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 75 పంక్తుల ఇష్టపది మాలిక...
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం
9963991125
చదువులో నేర్పించు సంస్కారమే లేదు
నడవడిక,నైతికము తడబడెను బడిలోన
గుణకములె కావాలి, గుణమేల పిల్లలకు?
సర్కారు బడిలోన చదువెందుకుంటుంది?
ఏసి క్లాసుల్లోన ఎడ్యుకేషన్ మెండు
*అమరవీరుల త్యాగమన్యాయమౌతోంది*
*వజ్ర భారతి లెమ్ము! పగ్గాలు గైకొమ్ము!*-8
వైద్యమంతా నేడు వ్యాపార సరుకయ్యె
రోగి ముఖ్యము కాదు రోగమే ధ్యేయమౌ
అవయవాలకు వివిధ ఆసుపత్రులు కలవు
కోతలే పెడతారు కుట్లతో కుడతారు
రోగమేదైననూ రాగమొకటే కోత
జేబుకైనను సరే, జీవికైనను హరే
//అమరవీరుల//...14
తిన్నదరగక సగము తిండి లేకను సగము
ప్రగతి రాకెట్టేమొ పైపైకి పోతోంది.
తాగ నీరుండదిట తూగ బారులు మెండు
మిషను వాటరు చూస్తె మిన్నెగిరి కొడుతోంది
హరితహారముతోడ హరియించె కలుషితము
స్వచ్ఛ గాలిని పీల్చ వచ్చె గద కరోనా
//అమరవీరుల//.....20
సంక్షేమ పథకాల సాకుతో పాలకులు
మన సొమ్ము కాజేసె మాయజేస్తున్నారు
ఒక్క రూపాయికే ఉచిత బియ్యమునిచ్చి
బక్కోడి యాకలిని పనుపలేకున్నారు
ఆ"బంధు" ఈ"బంధు" అన్ని "బంధు"లనిచ్చి
రాబందులై మేసి రాటుదేల్తున్నారు
//అమరవీరుల// .....26
వజ్ర భారతమందు వ్యత్యాసములు చెరిగె
ఉన్నోడు,లేనోడు ఒక్కతీరుగ మారె
ఉన్నోడి ధనమంత ఉట్లలో ఊరించు
లేనోడి ధనమంత రెక్కలను కారించు
ఉన్నోడు కొండంత ఉండియును తినలేడు
లేనోడు గోరంత లేకుండి తినలేడు
ఉన్నోడి ఆస్తులు ఉరుకుతూ పెరుగుతయ్
లేనోడి అస్థులు లీనమై విరుగుతయ్
//అమరవీరుల// .....34
వజ్ర భారతమందు పంజరమునను చిక్కె
న్యాయమే దోషియై నాణెముకు దాసియై
చేయి తడిపితె చాలు చెల్లు నీ వాదమే
వాదోపవాదాలు వర్తించవికనప్డు
న్యాయమూర్తికి వాట, న్యాయవాదికి వాట
తీర్పుతో దావాకు తీరుతుందిక తీట
//అమరవీరుల// .....40
పోలీసు వారికిట పోటి లేనే లేదు
ఆటలో,పాటలో, అరుదైన వేటలో
కాలు మోపితె చాలు కనకవర్షము కురియు
వేలు చూపితె చాలు వేస్తారు కానుకలు
రక్ష కోసము వెళ్తె రాలేవు బయటకిక
"రికమండు" లేనిచో రిక్తమే పిటిషన్లు
//అమరవీరుల// .....46
గాంధీజీ కలగన్న గ్రామీణ భారతము
పట్టణపు సొగసుతో ఫరిడవిల్లుతునుంది
ఉచిత పథకాలతో ఊర్లన్ని పనిమాని
నిత్యోత్సవాలలో నిహితమై మునిగినవి
మూడు పుష్పములున్ను ఏడు ఫలముల తోడ
పంచాయితీ సభలు పరుగులే పెడుతుండె
//అమరవీరుల// .....52
ఎన్నికల పర్వమున ఎన్నెన్నో వింతలు
మధ్యమే వరదలై మభ్యపెట్టును నిన్ను
నా ఓటు కొనమంటు నడిరోడ్డుపై జనులు
ధర్నాలు చేస్తారు,దాడులను చేస్తారు
పదివేల కోట్లతో ప్రజల వోట్లను కొన్న
పార్టియే గద్దెక్కి పాల్పడును దోపిడికి
//అమరవీరుల// .....58
మేథావులందరికి మేలేమిటో తెలుసు
రాజకీయము వైపు రాలేరు,కనలేరు
పాలకులు చేసేటి పాపాల ననలేరు
ప్రజ మోసపోయేటి పద్ధతులు కనలేరు
మేథావి మౌనముగ మిన్నకుండిననాడు
దేశ గతి చెయిదాటి నాశమై మిగులింక
//అమరవీరుల// .....64
ఆకాశవీథిలో రాకాసి శస్త్రాలు
యుద్ధ మేఘాలయ్యి ఉరిమురిమి నిలిచాయి
అగ్ని పథమున నడువ హవిసయ్యె రైల్లన్ని
సాహసిక్యము చేసి సామర్థ్యమయె యువత
దేశరక్షణలోన దేబెరించెను నీచ
రాజకీయెత్తుగడ,రాజేయు ఛేష్టలును
//అమరవీరుల//.....70
కులములకు,మతములకు కుమ్ములాటలు పెట్టి
కుర్చినెక్కుట కొరకు కుట్రలను చేస్తారు
డెబ్బదేండ్లైననూ దెబ్బలాటలు పోవు
అధికారమొందుటకు ఆరనివ్వరు సెగను
తెల్లోడి దారిలో నల్లోడి పాలనిది
అమరవీరుల త్యాగమన్యాయమౌతోంది
వజ్ర భారతి లెమ్ము! పగ్గాలు గైకొమ్ము!.....75
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 75 పంక్తుల ఇష్టపది మాలిక...
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం
9963991125
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి