కనకపు శిఖరాలు ;-ఎం. వి. ఉమాదేవి బాసర. నిర్మల్ జిల్లా.
 సొంత జీవితమెలా ఉన్నా 
కవి హృదయం రాగరంజితమే 
నిత్యాన్వేషిగా సమాజంలోని 
నవ రసభావనలూ వెలికితీస్తారు 
తనదైన శైలిలో విశ్లేషణ చేసినకవి 
సంఘహితం కోరుతూ సావధానులవుతారు 
ఎడారిలోన పూలు పూయించే 
లాహిరీ మంత్రం కవి హృదయమే 
రుధిరభాష్పాల స్థానంలో 
ఆనంద అమృతబిందువుల తడి 
సుడిగాలుల చెంత సురపారిజాతాల పరిమళం 
నిర్వేద స్ధితినుండి నిత్య కళ్యాణిరాగాలు 
సాహితీ వనంలో పూయించే స్వర్ణపుష్పాలు !!
మిత్రమా కవిరాజా జయోస్తు !!

కామెంట్‌లు