*ఆ అదృష్టమే... అదృష్టం *---కోరాడ నరసింహా రావు !
 అనూచానంగా వస్తున్న అత్యు త్తమ హైందవ సాంప్రదాయం !
స్త్రీ ఐదోతనానికీ, సౌభాగ్యానికి 
మంగళప్రద ప్రతీక... !!
స్త్రీ జీవితానికి ఇదొక ఉత్కృష్ట మైన పర్వదినం !
  ఈపండుగమహిళాజీవితంలో
రెండుసార్లువచ్చితనను,తనజీవితభాగస్వామిని,చుట్టాలు,స్నే హితులు,శ్రేయోభిలాసు లందరి నీ... ఆనందపరచే సందర్భం !
  తనభర్తతో నూతనజీవితాన్ని 
ప్రారంభించటానికి నాందిగా... 
వివాహానికిముందు,ముత్తైదువ లంతావధువుకునిండుగా గాజు
లుతొడిగితే.,మరలతొలిచూలు 
పురిటికి ముందు శ్రీమంతం.... !
తొలిచూలు పురుడంటే మహిళ కు,మరోజన్మే..క్షేమంగాపురుడు 
పోసుకుని,చక్కని బిడ్డతో తిరిగి రమ్మని ముత్తైదువులు గాజులు తొడిగి,పెద్దలందరూఆశీర్వదించి, పుట్టింటికి పంపే సందర్భం!
 ఈ రెండు వేడుకలూ...అందరి  ఆడవారికీ జరగకపోవచ్చు... !
 ఈ ఆనందం పొందగలిగే ఆడ జన్మ  అదృష్టమే... అదృష్టం !!
    ********

కామెంట్‌లు