సుప్రభాత కవిత ;-బృంద
మింటిలో విహారానికి
సిధ్ధమైన మిత్రునికి
భక్తిగా  స్వాగతిస్తున్న
ప్రశాంత కాసారం

మబ్బుల  రంగవల్లులతో
ముంగిలి  అలంకరించి
బుగ్గలెర్రబడగా
మురిసిపోతున్న మిన్ను

నింగి  మెరుపులు
నీటిలో  చూసి
నిండుగ నవ్విన
కుసుమాలు

చింతలనే చీకటిిని తోసి
వెలుగులతో వేదన గెలిచే
భావాలకు ఊపిరిపోసి
మధురమైన ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు