నీభాష గొప్ప నువ్ చాటవోయి-- కోరాడ నరసింహా రావు !
అచ్చులూ,హల్లులూ, గుణింత ములతో...సంధి,సమాసములు
జాతీయాలు, సామెతలతో.... 
 అలరారుతున్న మన తెలువు భాష... !

          అమ్మ,ఆవువంటిపవిత్ర
స్వరములతోచదువు మొదలైన
మన మాతృభాష... !

శబ్దములలో అర్ధ, భావముల పరిపుష్టి...దివ్యశక్తి జనిత బీజా
క్షర సృష్ఠి కలిగినట్టి మన  అమ్మ భాష.... !

పలుకు-పలుకున,తేనెలొలుకు తు, కలకండకమ్మదనమునిచ్చి 
హాయిగొలుపును మన తెలుగు భాష... !

వేరేభాషకూ లేని పద్య సౌగంధ 
మును పరిమళించును మన తెలుగు భాష !

గిడుగు గొడుగును పట్టిన మన వ్యవహారభాష... ప్రాంతీయ మాండలికాలతో సొగసులీను తున్నదీ  తెలుగుభాష... !

దేశభాషలందువెలుగులీను
   ఘనమైన భాష మన మాతృ భాష.... !
అమ్మ సజీవ చేతనము.... !
 మమ్మి  ప్రేత సమము.... !!
పరభాష మోజును వీడవోయ్ 
తెలుగోడా....., 
  నీ భాష గొప్పనుచాటవోయీ!
....   *******

కామెంట్‌లు