ముగ్గురమ్మలు ;-ఎం. వి. ఉమాదేవి.
(ఆట వెలదులు )

ముగ్గురమ్మలకును మురిపెంబు నాట్యము 
లలిత కళలయందు లాలసలును 
నెంత వారికైన నేదొక పనియందు 
శ్రద్ధ గలిగినపుడు శ్రమలుగాదు !

తొల్లి జేయలేద తోయంపు లాస్యము 
గౌరి పతిని గూడి గౌరవముగ
సరస గాత్రి తాను సాధ్వివీణాపాణి 
లక్ష్మికళలు నాట్య లక్షణములు !!


కామెంట్‌లు