సుప్రభాత కవిత ; -బృంద
కష్ట సుఖాల కలనేత
జీవితం..

వెలుగు నీడలు
ఒకదానివెంట ఒకటి

చీకటికి కుంగక
అడుగేసే ధైర్యం

వెలుగుకోసం ఓపికగా
ఎదురుచూసే సహనం

వెలుతురు మింగేస్తూ
చీకటి ఆవరించినట్టే...

తిమిరాన్ని తరిమేస్తూ
వెలుగూ వస్తుంది.

ఎదురయ్యే ఎత్తుపల్లాలన్నీ
లలాట లిఖితాలే!

సుఖమైనా విజయమైనా
మనల్ని వరించి రాదు.

కష్టించి పనిచేసి
సాధించి సొంతం చేసుకోవాలి.

మరలిరానివి మరువలేనివి
అనుభూతులు కూడగట్టుకుని

అడుగు ముందుకేస్తూ ..
సాగిపోయేదే జీవితం

అందనివి అందుబాటులో లేనివి
అందుకోలేనివీ.....

అన్నీ అందించి ఆనందింపచేసే
అద్భుతమైన ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు