ఆత్మగౌరవం కోసం!!? ప్రతాప్ కౌటిళ్యా
ఆడపిల్లలు
ఆధారపడి ఉండకూడదు
ఆడపిల్లలకు
అధికారం కావాలి!!?

అమ్మ రాణీ కావాలి
అక్క మంత్రి కావాలి
చెల్లి సైన్యాధ్యక్షురాలు అవ్వాలి!!?

నాన్న బిచ్చగాడు అయినా సరే
అన్న అనాధ అయిన సరే
తమ్ముడు అడుక్కున్నా సరే!!?

ఆడపిల్లలు
ఎవరిపై ఆధారపడి ఉండకూడదు!!?

ఆడపిల్లలకు అవకాశాలు ఇవ్వాలి
ఆడపిల్లలు సంపాదించాలి
ఆడపిల్లలకు ఆర్థిక స్వాతంత్రం కావాలి!!?

చెట్లు కోట్లు సంపాదిస్తున్నాయి
నదులు సంపదలతో గదులు నింపుతున్నాయి!!

పొలాలు పంటలతో డబ్బులు సంపాదిస్తున్నాయి!!?

ఆకుకూరలు కూరగాయలు ఫలాలు
లక్షలు సంపాదిస్తున్నాయి!!?

ఎవరేమనుకున్నా పైవన్నీ
పైసా పైసా కూడబెడుతున్నాయి!!?

అమ్మాయిలు కూడా
అడివిలాగా
భూమి లాగా
నది లాగా
వంటల లాగా
సంపదను సంపాదించాలి!!?

అమ్మాయిలు ఎవరిపై ఆధారపడకూడదు
ఎదగాలి
ఆత్మగౌరవం కోసం!!?

అడుక్కోవాల్సి వస్తే
అతడు ఆ పని చేస్తాడు
నీ పని నీవు చేసుకుంటూ ఎదుగు
ఆత్మగౌరవం కోసం!!?

ఆడపిల్లలు
చదువుకోవాలి
నిపుణులవ్వాలి!!?

ఆడపిల్లల కోసం
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు