ఆచెట్టు కింద ఓతాతకూచుని వాటి మాటలు ఆలకిస్తూ ఆలోచిస్తున్నాడు. ఆఉడుత చెట్టుకొమ్మకి తననోటి దంతాలతో పదును పెడుతోంది. కొంచెం గట్టిగా ఉన్న కాయను కొరికే ప్రయత్నం చేస్తోంది. కింద ఉన్న ఎలుక పైన ఉన్న కాకి అడిగాయి"ఎందుకలా రోజూ దాకలాగా నోరు తెరిచి రంపంలాగా కాయలు కొమ్మలు కొరుకుతావు?" దానికి ఉడుత అంది" మరి నేను చెట్టుకున్న కాయలను కాస్త కొరికిచూస్తేనే కదా దాని రుచి తెలిసేది?కడుపు నిండేది?బాగా నమిలితే కానీ జీర్ణంకాదు.ఎలుకా! నీవైతే గబగబా సిద్ధంగా ఉన్న ఆహారాన్ని దొంగిలించి కన్నంలో దాచుకుంటావు.కాకీ!నీవు ముక్కుతో లటుక్కున నోట్లో వేసుకుని గుటుక్కున మింగుతావు.పైగా నీకు మనుషులు పిండప్రదానం చేస్తారు. రోజూ అన్నంమెతుకులు చల్లుతారు. నీవు ఇంటింటికీ ఎగురుతావు.కుళ్లిన చచ్చినవాటిని పీక్కుని తింటావు.మరి నేను అలాకాదు. ఆకాయ పచ్చిదా దోరగాఉందా అని కొరికి చూస్తాను. ఉడుతలు చిలక కొట్టిన కాయలు కింద పడ్తే పిల్లలు ఏరుకుతింటారు.ఎందుకంటే అవి రుచిగా దోరగా ఉంటాయి. నేను ఎగురుతూ పరుగులు తీస్తాకాబట్టి అరుగుతుంది."ఎలుక అందుకుంది " వినాయకవాహనం అని ఆఒక్క రోజు నన్ను కూడా బొజ్జ గణపతి తో పూజిస్తారు.ఆపై ఎలుక బోనులోనో మందో పెట్టి చంపుతారు.నాబతుకంతా దినదినగండం నూరేళ్ళు ఆయుష్షే!" కాకి అంది" ఎవరిబాధలు వారికుంటాయి. కాకిగోల పాడుదొంగకాకి అని తిడ్తారు. ఉడతా!నీవు రామాయణం లో ప్రసిద్ధి!వారధి కట్టేప్పుడు గులకరాళ్లు మోస్తే రాముడు తన వేళ్ళతో నీవీపు నిమిరాడు.ఆచారలు శాశ్వతంగా ఉన్నాయి.ఉడతాభక్తి సాయం అని నిన్ను పొగుడుతారు కదా?" వాటి సంభాషణ వింటున్న తాత నిట్టూర్పు విడిచాడు "మీరు మూగజీవాలైనా వేరే ప్రాణికి ఆహారం గా ఉపయోగపడతారు.నేను వయసు మీద పడ్డ ముసలాడిని!అందరూ ఉన్నా ఇలా చెట్టుకింద దిక్కు దివాణంలేని వాడిలా పడున్నాను.ఎవరైనా దయతలిస్తే పొట్టలోకి ఇంతముద్ద పోతుంది. ఆరోగ్యంగా ఉంటే ఎవడైనా మూత్ర పిండాలు తీసి నామొహాన ఇంతడబ్బు అన్నా పారేస్తాడు.నేనే రోగాల పుట్టని !ఎందుకూ పనికిరాని వస్తువు కన్నా హీనం నాబతుకు"అని నిట్టూర్పు విడిచాడు 🌹
తాత ఆలోచన! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి