పేరడీ పాట! అచ్యుతుని రాజ్యశ్రీ హైదరాబాద్
(పాడుతా తీయగా )

పాడుతా జోరుగా!
మారుతా చెవిపోటుగా!
హాయిగా నిద్రలో జోగేవా?
చూపుతా నా తడాఖా!
శివరాత్రి జాగారంతో అల్లాడు
నినుజూసి నవ్వుతా!

నీవు పోతెమాత్రమేమి
ఉన్నాయి అనంత ప్రాణులు!
ధరలు మండినా  వరదల్లో మునిగినా లేదు మాకుచావు!

పైరులు నీటిపాలైనా కోట్లాది రూపాయలు రెక్కలొచ్చి ఎగిరినా ఎదమీద  వాలే నాసొదలే ఇనుకో!
దోమకాటు మిన్న అని తెలుసుకో!

పాడుతా అందుకే కొత్త కొత్త రాగాల !నాసంగీతం జోరుకి
నాసూదిపోట్లకి  ఓమనిషీ!
తెలుసుకో నీకన్నా దోమ మిన్నని! 
కప్పల్ని కాపాడు!
ఇకనైనా బుద్ధి తెచ్చుకో!
....స్వస్తి...

కామెంట్‌లు