శివా కి మహా బద్ధకం!అమ్మా నాన్న చెప్పేది ఈచెవితో విని ఆచెవితో వదిలేస్తాడు.నాన్న కి అమ్మ అంటే నిర్లక్ష్యం!అమ్మని ఎప్పుడూ "నీది పిచ్చికబుర్ర! డిగ్రీ చదివావు ఏంలాభం?"అని అస్తమానం అనటంతో శివా కి కూడా అమ్మ అంటే అదోరకమైన చులకన భావం ఏర్పడింది. పొట్టిగా సన్నగా ఉండే అమ్మ కన్నా ఒడ్డు పొడుగుతో అందంగా స్మార్ట్ గా ఉండే నాన్నంటే వాడికి ఇష్టం!రాత్రి 10దాకా నాన్న తో కలిసి టి.వి.చూస్తాడు.తెల్లారి 7దాకా నాన్న దుప్పటిలో దూరి వెచ్చగా పడుకుంటాడు. భర్తతో పోట్లాడి విసిగిపోయిన అమ్మ ఇకచేసేదేమీలేక నోరెత్తదు శివా ముందు కొట్లాడుకుంటే బాగుండదని! ఆరోజు పుస్తకం చేతిలో పట్టుకుని మధ్యలో కామిక్స్ పుస్తకం పెట్టి చదువుతున్నాడు శివా! భర్త బైటకి వెళ్లేదాకా ఊరుకున్న అమ్మ వెంటనే వాడిదగ్గర కూచుని పుస్తకం లోని ప్రశ్నలు అడగసాగింది.హోంవర్క్ అంతాచెత్తగా పిచ్చిగీతలు లాగా గలీజుగా ఉంది. భర్తకి గుణపాఠం చెప్పాలి ఎలా?శివా కి తనపై నమ్మకం కలిగించాలి.ఆరోజు బడివిద్యార్ధి చనిపోతే బడి కి సెలవు ఇచ్చారు. తనఫ్రెండ్ లతని పిలిచింది. ఆమె సైకాలజిస్టు కూడా!ఆమెకొడుకు రోహిత్ శివా ఒకేబడి ఒకే క్లాస్!సెక్షన్లు వేరు.రోహిత్ లత సరాసరి శివా గదిలోకి వెళ్ళారు.అమ్మ చాయ్ కాస్తోంది."అరెశివా!పుస్తకాలన్నీ ఇలా షెల్ఫ్ లో పెట్టుకో!క్లాస్ వర్క్ బుక్స్ బల్లపై చేతికి అందేలా ఉంచుకో! తూర్పు వైపు దీపారాధన చేసి కాసేపు దాని వంక తదేకంగా చూడు."అని చిన్న చిన్న ప్రశ్నలు క్లాస్ వివరాలు అడిగింది లత!"ఆంటీ!"అంటూ శివా ఉషారుగా మాట్లాడుతున్నాడు. తల్లి ఆశ్చర్యంగా అంది"లతా! బెల్లం కొట్టిన రాయిలాగా నాతో ఏమీచెప్పడే బాబు!" లత శివా తో అంది"ఈరోజు రోహిత్ మీఇంట్లో చదువు కుంటాడు. రేపు నువ్వు మాఇంటికి రా సాయంత్రం బడివిడిచిపెట్టగానే!ముందు కష్టమైన సబ్జక్ట్ ఇద్దరు చర్చించుకుని సాయంత్రం 6నుంచి7దాకా ఆడుకోండి.ఆపై ఇంటికెళ్లి హోంవర్క్ పూర్తిచేసి 8కల్లా నిద్రపోవాలి.సరేనా?" "అలాగే ఆంటీ!" అన్నాడు శివా సంతోషంగా! ఇప్పుడు శివా తన సెక్షన్ లో ఫస్ట్! రోహిత్ అన్ని సెక్షన్ల పై ఫస్ట్!శివా తండ్రికి కూడా తన తప్పు తెలిసివచ్చింది 🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి