ఆరిపోని దీపం ..!!----డా.కె.ఎల్.వి.ప్రసాద్,హన్మకొండ.

 ఈదీపం 
నాబాల్యంలో 
మా ఇంటి దీపం !
అప్పటికదే దీపం,
మాఇంటిని మెండుగా 
కాంతివంతం చేసింది !
మాబాల్యం అంతా
నా..తల్లిదండ్రులు 
ఆ ..దీపమై వెలిగారు ,
మా జీవితాలకు 
నిండుగా -
వెలుగులు నింపారు !
మా ..నాయన 
ప్రతిసాయంత్రం 
ఈ లాంతరు -
చిమ్నీ తుడుస్తుంటే ,
మమ్మల్ని అంటిన 
మురికిని ...
ప్రక్షాళనం -
చేస్తున్నట్టుండేది !
ఆ ..దీపం 
కొడిగట్టిన వత్తిని 
సరిజేస్తుంటే ...
మాలో ..చైతన్యాన్ని 
రాజేసినట్టువుండేది !
డబ్బానిండా -
కిరొసిన్ నింపుతుంటే ,
మా ..ఆకలి కడుపులు 
నింపుతున్న -
భావన కలిగేది ...!
మాజీవితాలకు 
జిలుగు -వెలుగులు 
నింపడానికి ...
నడుంకట్టింది ,
ఈ లాంతరు వెలుగులే!
ఈనాడు..
పండువెన్నెన్నెల్లాంటి 
వెలుగులో బ్రతుకుతున్నా ,
అలనాటి దీపపు కాంతి 
ఈనాటికి ....మదిలో
మెదులుతూనే ఉంటుంది !
గతాన్ని --
గుర్తుచేస్తూనే ఉంటుంది.!!
                   ***

కామెంట్‌లు